ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeస్పోర్ట్స్టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ… క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ

టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ… క్రికెట్ ఫ్యాన్స్ నిరాశ

📰 Generate e-Paper Clip

జయజయహే: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్, కింగ్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ మేరకు ఎమోషనల్ ట్వీట్ చేశారు. 14 ఏళ్ల ఈ జర్నీని ఎంతగానో ఆస్వాదించానని అన్నారు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ తనను పరీక్షించిందని, పాఠాలు నేర్పి.. బెస్ట్ క్రికెటర్ గా మార్చిందన్నారు. తన కెరీర్ లో విజయాలను చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు కోహ్లీ. తన పూర్తి కెరీర్ లో మొత్తం 123 మ్యాచ్ లు ఆడి 9230 పరుగులు చేశారు. దీనిలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే టీ20ల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్నారు. 2011లో వెస్ట్‌ ఇండీస్‌తో టెస్టుల్లో విరాట్‌ కోహ్లీ అరంగేట్రం చేశారు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు కోహ్లీ ఆడాడు. ఇటీవల టీమ్ ఇండియా సారథి రోహిత్ శర్మ సైతం టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెబుతూ తన ఇన్ స్టా ఖాతాలో పోస్టు చేశారు. ఇలా వరుసగా రెండు క్రికెట్ శిఖరాలు టెస్టు క్రికెట్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!