ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీహైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు

హైదరాబాద్ మిస్ వరల్డ్ పోటీలపై యుద్ధ నీడలు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: జయజయహే : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మిస్‌ వరల్డ్‌ పోటీల నిర్వాహక సంస్థ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆయా దేశాల నుంచి వచ్చిన వారందరి భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. అయితే, హైదరాబాద్‌లోని వ్యూహాత్మక సంస్థల భద్రత, సామాన్య ప్రజల రక్షణకు అత్యంత ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మిస్‌ వరల్డ్‌ పోటీలకు మూడు వారాలపాటు పూర్తిస్థాయి భద్రత పెద్ద సవాలే. ఈ నేపథ్యంలో కేంద్రం అభిప్రాయం ప్రకారం నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. గురువారం నాటి పరిస్థితులను చూసి పాకిస్థాన్‌లో ఉన్న అమెరికా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ సూచించారు. దాంతో మిస్‌ వరల్డ్‌ ఆర్గనైజేషన్‌ సైతం పోటీలను కొనసాగిస్తే తలెత్తే సమస్యలపై ఆలోచిస్తోందని, అంతర్జాతీయంగా అభిప్రాయాలను సేకరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వంతోనూ ఎప్పటికప్పుడు చర్చిస్తోందని తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!