ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅమితానందంలో అనకాపల్లి ఎం.పీ

అమితానందంలో అనకాపల్లి ఎం.పీ

📰 Generate e-Paper Clip

జయజయహే : అమెరికాలో ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయమైన మియామీ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పట్టా పొందిన సి.ఎం రమేష్ తనయుడు సి.ఎం రిత్విన్ . రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ సి.యం.రమేష్ ద్వితీయ కుమారుడు ఇటీవల అమెరికాలోని ప్రతిష్టాత్మక మియామీ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీను పూర్తిచేసారు.ఈ సందర్భంగా మియామీ యూనివర్సిటీ నిర్వహించిన కన్వోకేషన్ కార్యక్రమంలో కుటుంబసమేతంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా కుమారుడి కాన్వకేషన్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ప్రపంచంలోనే అత్యున్నతమైన విశ్వవిద్యాలయాల్లో ఒకటైన మియామీ యూనివర్సిటీ నుంచి ఉన్నత స్థాయి గ్రేడ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడం పట్ల అత్యంత ఆనందదాయకంగా ఎంతో గర్వంగా ఉంది అని కుమారుడు రిత్విన్ ని అభినందిస్తూ పోస్ట్ చేశారు.తనయుడి విజయంనకు ముఖ్య కారణం అయిన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.భవిష్యత్తులో సమాజానికి సేవ చేసే మార్గంలో మరిన్ని ఉన్నతమైన విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!