Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీకేబినెట్ నిర్ణయాలివే..

కేబినెట్ నిర్ణయాలివే..

జయజయహే : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన గురువారం సచివాలయంలో జరిగిన ఈ-క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో కొనసాగుతున్న ఆపరేషన్ సింధూర్‌కు మంత్రి మండలి సంఘీభావాన్ని ప్రకటించింది. సిందూర్‌ అనే పేరుతో అందరి సెంటిమెంట్‌ను టచ్‌ చేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు పేర్లు పెట్టే సమయంలో అందరికీ దగ్గరయ్యేలా పేర్లు పెట్టాలని సీఎం చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని పురపాలక సంస్థల్లో 281 పనులు కన్సెషనరీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద చేపట్టేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జలవనరుల శాఖలో “జలహారతి కార్పొరేషన్” పేరుతో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూలు జిల్లా బి. తండ్రపాడు గ్రామంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఎల్ ఎన్ జీ హబ్ స్థాపనకు భూమి కేటాయింపుకు ఆమోదం. నెల్లూరు జిల్లాలో ఎకరాకు రూ.20 లక్షల పరిహారంతో భూ సేకరణ నిర్ణయం. టీటీడీ ఐటి విభాగంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఐటి)ని జనరల్ మేనేజర్ (ఐటి)గా అప్‌గ్రేడ్ చేసేందుకు ఆమోదం. పర్యాటక రంగంలో ఉపాధి కల్పన ప్రోత్సాహక విధానానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?