మాడుగుల,జయజయహే : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ కల్పనలో భాగంగా వినోదం పెందుర్తి హైస్కూల్లో 40 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తునట్టు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి ఎన్.గోవిందరావు గురువారం తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో పదవ తరగతి, ఐ టి ఐ, డిప్లొమా, డిగ్రీ, పి జి వరకు చదువుకొని 18 నుండి 35 ఏళ్ల వయస్సు గల యువతీ, యువకులు పాల్గొనవచ్చన్నారు. కాబట్టి ఆసక్తి కలిగిని నిరుద్యోగ యువతీ, యువకులు తమ వివరములను నైపుణ్యం. ఏపీ.జిఓవి. ఇన్ వెబ్ సైట్ నందు తప్పనిసరిగా నమోదు చేసుకొని, రిఫరెన్స్ నెంబర్ తో పాటుగా ఎక్కువ రెజ్యూమ్ లు,ఆదార్ కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు జెరాక్స్ లతో ఉదయం 9 గంటలకు జాబు మేళా జరుగు ప్రదేశానికి హాజరు కాగలరన్నారు.మరిన్ని వివరములకు 8106327482 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
పెందుర్తిలో జాబ్ మేళా
0
59
Previous article
Next article
RELATED ARTICLES

