జయజయహే : బైసరాన్ లోయలోని పహల్గామ్ సమీపంలోని హిందువులు పై జరిగిన ఉగ్రదాడిలో తీవ్రవాదులు పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మందిలో అందరూ పురుషులే. ఈ ఘటనతో అనేక మంది మహిళలు వితంతువులుగా మిగిలిపోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే పేరు పెట్టడం వెనుక గొప్ప సంకేతార్థం ఉంది. “సిందూర్” భార్యగా ఉన్న మహిళ ధరించే పవిత్ర చిహ్నం. పురుషులను టార్గెట్ చేసిన దాడి వల్ల భార్యలు సింధూరాన్ని కోల్పోయినట్టైంది. ఈ నేపథ్యంలో, భారత సైన్యం ఆ మహిళలకు న్యాయం చేయడం కోసం వారి భర్తల ప్రాణాలను పోగొట్టిన వారిపై ప్రతీకారం తీర్చడంలో భాగంగా ఈ ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ సిందూర్’ అనే భావప్రధానమైన పేరు ఇచ్చింది.
ఆపరేషన్ సిందూర్ అనే పేరు ఎందుకు?
0
47
Previous article
Next article
RELATED ARTICLES

