Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీజీవీఎంసీ మెకానికల్ విభాగంపై మేయర్ సమీక్ష

జీవీఎంసీ మెకానికల్ విభాగంపై మేయర్ సమీక్ష

విశాఖపట్నం: జయజయహే : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ మెకానికల్ విభాగoపై మంగళవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నగర మేయర్ మట్లాడుతూ

జీవీఎంసీలో గల ఎలక్ట్రికల్ వాహనాల తోపాటు జీవీఎంసీ సొంత వాహనాలు, అద్దె వాహనాలు ఎన్ని ఉన్నాయని వాటిని ఏఏ అధికారులకు కేటాయించారని మేయర్ ఇంజనీరింగ్ అధికారులను ఆరా తీశారు. నగరంలోని 8 జోన్లలో వ్యర్ధాలు తరలించే వాహనాలు ఎన్ని ఉన్నాయని, వాటి నిర్వహణ, ఎన్ని ట్రిప్పులు వ్యర్ధాలను తరలిస్తున్నాయి అలాగే జెసిబిలు, లోడర్లు , బాబ్కట్లు, క్లాప్ వాహనాలు, బీచ్ క్లీనింగ్ యంత్రాలు, తదితర వాహనాలు ఎన్ని ఉన్నాయని అవి నిర్వహించే పనితీరు పై జీవీఎంసీ పర్యవేక్షక ఇంజనీరు (మెకానికల్) గోవిందరావు ను అడిగి తెలుసుకున్నారు. బీచ్ ను శుభ్రం చేసేందుకు బీచ్ క్లీనింగ్ యంత్రాలు ఎన్ని పనిచేస్తున్నాయని, వాటి పనితీరును స్వయంగా పరిశీలిస్తానని తెలిపారు. జీవీఎంసీ వాహనాలకు సంబంధించి అనవసరపు ఖర్చులు తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని అలాగే డీజిల్, పెట్రోలు ఖర్చులు నియంత్రణకు వాహనాలకు జిపిఎస్ సిస్టంతో పాటు డ్రైవర్ల లాగు బుక్కులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని,జీవీఎంసీలో నిరుపయోగంగా ఉన్న వినియోగం లేని వాహనాలను వేలం వేసేందుకు ప్రణాళికాయుతమైన చర్యలు తీసుకోవాలని ప్రధాన ఇంజనీర్ పి శివప్రసాద్ రాజు ను మేయర్ ఆదేశించారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో ప్రధాన గెడ్డలు,కాలువలలో లోని వ్యర్ధాల పూడికల తొలగింపునకు వాటి స్థితిగతులపై ఇప్పటి నుండే చర్యలు తీసుకోవాలని, గెడ్డలను స్వయంగా పరిశీలిస్తానని మేయర్ తెలిపారు. గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద భద్రతా చర్యల దృష్ట్యా సమర్థవంతమైన కాపలాదారులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జీ వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని పరిసర ప్రాంతాలలో నిత్యం పరిశుభ్రంగా ఉండేటట్లు పరిశుభ్రతా చర్యలు చేపట్టాలని జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ . ఎన్.వి.నరేష్ కుమార్ ను మేయర్ ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ ప్రధానం ఇంజనీరు కె శివప్రసాద్ రాజు అదనపు కమిషనర్లు డివి రమణమూర్తి, ఎస్ఎస్ వర్మ, కార్యనిర్వహక ఇంజనీరు రత్నాకర్ రెడ్డి, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు సహాయక ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?