Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీజీవిఎంసీ కమీషనర్ ను నియమించండి - ముఖ్యమంత్రికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వినతి

జీవిఎంసీ కమీషనర్ ను నియమించండి – ముఖ్యమంత్రికి టిడిపి రాష్ట్ర కార్యదర్శి వినతి

జయజయహే : మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ (జీవిఎంసీ ) కమీషనర్ నియామకంలో జాప్యం కారణంగా జిల్లాలో పాలనా యంత్రాంగం స్థబ్దుగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిఎంసీ కమీషనర్ నియామకం విషయంలో త్వరతగతిన ఆలోచన చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చేసుకొని పాలన సాగిస్తున్నారని అన్నారు. యువత, మహిళలు, మేధావులు సైతం కూటమి ప్రభుత్వం పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్రంలోనే ఆర్ధిక రాజధానిగా, ఉత్తమ కార్పొరేషన్ గా ఉన్న విశాఖ జీవిఎంసీ కమీషనర్ బదిలీ అయి మూడు నెలలు కావస్తున్నా ఇంకా కొత్త కమీషనర్ ను నియమించక పోవడం వలన ప్రజల్లో ద్వంద్వ అర్ధాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. ఈ విషయంలో భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ కలుగజేసుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్లి కొత్త కమీషనర్ నియామకం త్వరితగతిన జరిగేవిధంగా చేయాలని గంటా నూకరాజు విజ్ఞప్తి చేసారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?