జయజయహే : అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో వి. ఎం .ఆర్. డి .ఎ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కళ్యాణ మండపం పనుల్ని మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. నిర్మాణ స్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 13 సంవత్సరాలుగా నిర్మాణం జాప్యం అవుతూ రావడం బాధాకరమని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉంచుతామని మంత్రి హామీ ఇచ్చారు. వేపగుంట పరిధిలో 20వేల చదరపు అడుగుల స్థలంలో ప్రజల కోసం నిర్మించడం అభినందనీయం నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి కూటమి ముందుంటుంది. అనకాపల్లి జిల్లాలో అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని ఆధికారులను ఆదేశించాం స్థానిక రోడ్డు నిర్మాణ పనులను కూడా పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడుతానని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు .ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా అనకాపల్లిలో అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి సాధించాలంటే క్షేత్ర స్థాయిలో అభివృద్ధి అత్యంత అవసరం అని చెప్పారు .
త్వరలో వి ఎం ఆర్ డి ఎ కల్యాణ మండపం అందుబాటులోకి – మంత్రి కొల్లు రవీంద్ర
0
72
Next article
RELATED ARTICLES

