Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీనగర అభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉంది - విశాఖ మేయర్

నగర అభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉంది – విశాఖ మేయర్

జయజయహే : విశాఖ నగరానికి చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి సాహితిని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు అభినందించారు. 13 సంవత్సరాల వయసులోనే రోలరు ఆర్టిస్టిక్ స్కేటింగ్ లో అంతర్జాతీయ, జాతీయ పతకాలను సాధించిన సాహితి ప్రతిభను కొనియాడారు. నగర అభివృద్ధిలో క్రీడల పాత్ర ఎంతో ఉందని, క్రీడలను ప్రోత్సహించడానికి విశాఖ మేయర్ గా తనవంతు ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. నగరంలో ఉన్న క్రీడా సదుపాయాలను ఉపయోగించుకొని విశాఖకు మరింత పేరు తీసుకు రావాలని ఈ సందర్భంగా పీలా శ్రీనివాసరావు చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?