Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీగిన్నిస్ రికార్డుల్లోకి సినీనటుడు శోభన్ బాబు మనవడు డా సురక్షిత్

గిన్నిస్ రికార్డుల్లోకి సినీనటుడు శోభన్ బాబు మనవడు డా సురక్షిత్

జయజయహే : సినీనటుడు శోభన్ బాబు మనవడు డాక్టర్ సురక్షిత్ బత్తిన గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కడానికి మార్గం సుగమం అవుతోంది. ఓ మహిళ గర్భాశయంలో భారీ కణితి ఉండటంతో ఓపెన్ సర్జరీ ద్వారా కాకుండా 3డీ ల్యాపరోస్కోపీతో చాకచక్యంగా తొలగించారు. ఈ అరుదైన ఆపరేషన్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకు ప్రతిపాదనకు వెళ్లింది. తమిళనాడుకు చెందిన 44 ఏళ్ల మహిళ భారీ కణితి (ఫైబ్రాయిడ్)తో నొప్పి విపరీతంగా ఉండటాన్ని భరించలేకపోయింది. దేశంలోని వివిధ ఆసుపత్రుల్ని సంప్రదించినా దాన్ని తొలగించడం రిస్కతో కూడుకున్నదని, ఓపెన్ సర్జరీ తప్ప మరో మార్గం లేదని చెప్పారు. డా సురక్షిత్ బత్తిన ను సంప్రదించాగా .. అనస్తీషియా విభాగం అభిప్రాయం తీసుకుని 8 గంటలపాటు పూర్తిస్థాయి 3డీ ల్యాపరోస్కోపీతో సర్జరీ నిర్వహించి భారీ కణితి ఉన్న 4.5 కిలోల గర్భాశయాన్ని తీసేశారు. ప్రస్తుతం ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డు పరిశీలనలో ఉంది. మరి కొన్నివారాల్లో అధికారిక ప్రకటన వస్తున్నట్లు సురక్షిత్ తెలిపారు. అఖిలభారత శోభన్ బాబు సేవాసమితి భట్టిప్రోలు శ్రీనివాసరావు, మాజీ ఎమ్. ల్. సి. సుధాకర్ బాబు, పూడి శ్రీనివాస్,బి. బాలసుబ్రమణ్యం, టి. వీరప్రసాద్, టి. సాయికామరాజు, కుర్ర రాంబాబు,యు. విజయ్, ఎస్. ఎన్. రావు, బొండా రాంబాబు, లంకలపల్లి చాముండేశ్వరావు, ధార సత్యనారాయణ అభినందనలు తెలిపారు. గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాలని కోరుకుంటున్నామని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?