ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీబుచ్చయ్యపేట మండలంలో కలెక్టర్ పర్యటన

బుచ్చయ్యపేట మండలంలో కలెక్టర్ పర్యటన

📰 Generate e-Paper Clip

బుచ్చయ్యపేట : జయజయహే : అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం బుచ్చయ్యపేట మండలంలోని ఎల్బీ పురం,బంగారు మెట్ట గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పనులను, నీటి గుంటలను, జల జీవన్ మిషన్ పనులను పరిశీలించారు.నీటి తొట్టెలను ప్రారంభించారు.ఉపాధి శ్రామికులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఉపాధి పనులలో శ్రామికులకు కనీస వేతనం రోజువారి రూ.300లు వచ్చేలా పని కల్పించాలని ఆదేశించారు.జల జీవన్ మిషన్ పనులు పూర్తి చేసి ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించాలన్నారు. వాటర్ ట్యాంకులో ప్రతిరోజు క్లోరినేషన్ చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సర్పంచ్ తమరాన దాసు,టిడిపి నేతలు దొండా శ్రీను,సాయం శేషు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!