ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపేద విద్యార్థికి "వాసుపల్లి" ఆర్థికసాయం..

పేద విద్యార్థికి “వాసుపల్లి” ఆర్థికసాయం..

📰 Generate e-Paper Clip

విద్యా, వైద్య పథకాలు అటకెక్కించిన కూటమి ప్రభుత్వం..

మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

జయజయహే : పేద విద్యార్థి కళాశాల ఫీజు కోసం దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆర్థిక సాయం చేశారు. దక్షిణ నియోజకవర్గంలో 36వ వార్డు కు చెందిన పొడుగు జోష్ణవి కు ఆశీలమెట్ట కార్యాలయంలో రూ. 5000 రూపాయలు సొంత నగదును అందజేశారు. విద్య, వైద్యం పేదలకు అందించడంలో తనవంతు సాయంగా నిర్విరామ సేవలందిస్తున్నానని వాసుపల్లి వెల్లడించారు. వైఎస్ఆర్సిపి అంటేనే పేదల పార్టీ అని, వైయస్సార్ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యం కార్పొరేట్ స్థాయిలో పేదలకు అందించడమే లక్ష్యంగా పని చేసి ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారన్నారు. నేడు కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పాలన అందక పేదప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెల్లడించారు. అమ్మ ఒడికి సున్నం పెట్టారని, భవిష్యత్తులో మెడికల్ చేయాలనుకునే విద్యార్థులకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం వచ్చి నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. చిత్తశుద్ధి లేనీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ విద్యా వైద్యాన్ని అటకెక్కించారని అన్నారు. కార్యక్రమంలో 34 వ వార్డ్ కార్పొరేటర్ తోట పద్మావతి, సౌత్ బూత్ కమిటీ ప్రెసిడెంట్ 39వ వార్డ్ ప్రెసిడెంట్ ముజుబ్ ఖాన్, జగన్నాథ స్వామి టెంపుల్ మాజీ ధర్మకర్త కట్టుముంచు సాగర్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!