Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీవాసవి విద్యానిధిని ప్రారంభించిన విసిఐ

వాసవి విద్యానిధిని ప్రారంభించిన విసిఐ

పేద వైశ్య విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు ఐ ఎన్ పి రామకృష్ణ

హైదరాబాద్ జయజయహే : ఉన్నత చదువులు చదువుకోలేని ఆర్యవైశ్య పేద విద్యార్థులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు వాసవి విద్యానిధి పథకాన్ని శుక్రవారం ప్రారంభించారు. సికింద్రాబాద్ అంతర్జాతీయ వాసవి క్లబ్ కేంద్ర కార్యాలయంలో అంతర్జాతీయ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని సీనియర్ బిజెపి నాయకుడు చికోటి ప్రవీణ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ విద్య నిధికి సంబంధించిన దరఖాస్తు ఫారాలను కూడా విడుదల చేశారు. ప్రతి వ్యక్తికి 25 వేల రూపాయలు వడ్డీ లేని రుణాన్ని పది మాసాల కాలంలో తీర్చే విధంగా అందిస్తామని ఐఎన్పి చెప్పారు. ఇందుకోసం కోటి రూపాయల నిధిని సమకూర్చడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని పేద ఆర్యవైశ్య విద్యార్థులు సద్వినియోపరుచుకోవాలని కోరారు. అవసరమైన వారు తమ స్థానిక వాసవి క్లబ్ ద్వారా జిల్లా గవర్నర్ ఆమోదంతో పంపించాలన్నారు. ఈ ఏడాది అనేక కొత్త పథకాలకు శ్రీకారం చుట్టిన అంతర్జాతీయ వాసవి క్లబ్ ఇది మరొక కొత్త పథకం అని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఈ పథకం ఆసరాగా నిలుస్తాదని చెప్పారు. అభ్యర్థులు ఈనెల 31వ తేదీలోగా తమ దరఖాస్తులను విసిఐకు పంపించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా నిధి పథకం చైర్మన్ అంతర్జాతీయ వాసవి క్లబ్ అధ్యక్షుడు గార్లపాటి సంతోష్, అంతర్జాతీయ వాసవి క్లబ్ ప్రతినిధులు ఏవీఎస్ఎన్ గుప్తా, నూలి వెంకటరమణ మూర్తి, అగిరి వెంకటేష్, మాసెట్టి ఉపేందర్, పిప్పల అశోక్ కుమార్, నాలం ఆండాలు, విశ్వనాథం నాగేష్, వంక మామిడి రాజేందర్,తదితరులు పాల్గొన్నారు.

                               

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?