Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీరైతులను కోటీశ్వరులను చేస్తాం

రైతులను కోటీశ్వరులను చేస్తాం

పరిశ్రమలు పెట్టించి చేయూతనిస్తాం

సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు

నెల్లూరు జిల్లాలో ఎంఎస్ఎంఈలుకు శంకుస్థాపన

జయజయహే : నెల్లూరు జిల్లాలో ఎంఎస్‌ఎంఈ పార్కును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ప్రారంభించారు. వర్చువల్‌గా 11 ఎంఎస్‌ఎంఈ పార్కులను సీఎం మొదలుపెట్టారు. 14 ఎఫ్‌ఎఫ్‌సీలు, 25 ఎంఎస్‌ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. అసంఘటిత కార్మికులు అధికంగా ఉన్నారని… అందులోనూ వ్యవసాయం మీద అత్యధికంగా ఆధారపడ్డారన్నారు. ఇప్పుడే భవన నిర్మాణ కార్మికుల బాధలు చూశానని… మిట్టమధ్యాహ్నం వేళ కాలే ఇనుప కమ్మిలతో పనిచేస్తున్నారని.. వారందర్నీ ఆదుకోవడం మనందరి బాధ్యత అని చెప్పుకొచ్చారు. టీడీపీ సింబల్‌లో పేదలకు గుర్తుగా ఇళ్లు, రైతులకు గుర్తుగా నాగలి, కార్మికులకు గుర్తుగా చక్రం ఉంటుందని.. ఆ చక్రం దేశంలోని ఏ పార్టీ సింబల్‌లో ఉండదన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీ చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఇసుక ఉచితం చేశామని… భవన నిర్మాణ కార్మికుల పనుల కోసం భవన అనుమతులు తేలికగా పొందే వీలు కల్పించామన్నారు. నారంపేట ఎంఎస్‌ఎంఈ పార్కులో నేరుగా పరిశ్రమ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. షెడ్లు, కరెంటు అందుబాటులో ఉంటాయని. కామన్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. 34వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరులని

చేయాలనుకున్నామన్నారు. 29 వేల మంది రైతులు భూములిచ్చారని.. ఎక్కడా రైతుకి అన్యాయం జరగకుండా చూసిన పార్టీ టీడీపీ అని వెల్లడించారు. కొందరికి అభివృద్ది జరగకూడదని… పుల్లలు పెడుతుంటారని మండిపడ్డారు.

                                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?