ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఅమరావతిలో ఇక 34వేల ఎకరాల్లో రాజధాని..సీఎం చంద్రబాబు

అమరావతిలో ఇక 34వేల ఎకరాల్లో రాజధాని..సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

జయజయహే : అమరావతిలో ఇక 34వేల ఎకరాల్లో అమరావతిని నిర్మించి అక్కడి వారిని కోటీశ్వరులని చేయాలనుకున్నామన్నారు. 29 వేల మంది రైతులు భూములిచ్చారని.. ఎక్కడా రైతుకి అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ప్రతీ ఒక్కరూ అమరావతి తమ రాజధాని అని గర్వంగా చెప్పుకునేలా నిర్మాణాలు జరుగుతాయని వెల్లడించారు. అమారవతిలో భూములు ఇచ్చిన రైతులకు రిటర్న్ ప్లాట్లు ఇస్తామని ..భూముల ధరలు పెరుగుతున్నాయని చంద్రబాబు వివరించారు. అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇక, ఏపీలో 175 ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. నారంపేట పార్కు వల్ల ఎన్నో కుటుంబా లు ఆర్ధికంగా ఎదుగుతాయన్నారు. 50 ఎంఎస్‌ఎంఈ పార్కులను ఇక్కడి నుంచే ప్రారంభించా మని.. మండలానికో ఎంఎస్‌ఎంఈ పార్కు తీసుకురావాలన్నది తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!