ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీకార్మికుల హక్కుల విజయం మేడే

కార్మికుల హక్కుల విజయం మేడే

📰 Generate e-Paper Clip

అగనంపూడి : జయజయహే : శ్రీ బొర్రమాంబ భవన కార్మికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు లో బలిరెడ్డి సత్యనారాయణ టిఎన్టియుసి పతాక విష్కరణ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే 1 తేదీ జరుపుకుంటారు, ఎన్నో ఉద్యమాలు ద్వారా 8 గంటల వరకు మాత్రమే పనిచేసే హక్కును కార్మికులు దాదాపు అన్ని దేశాల్లో సాధించుకున్నారు ఈ విజయానికి సూచికగానే మే డే జరుపుకుంటున్నారు. 85 వార్డు టిడిపి అధ్యక్షులు కర్రి దశంద్ర మాట్లాడుతూ అగనంపూడి లో ఉన్న భవన కార్మికులు సంక్షేమానికి ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దృష్టికి తీసుకుని వెళ్లి వీరికి సామాజిక భవనం నిర్మాణానికి కృషి చేస్తామని అన్నారు. భవన కార్మికులంతా వారి కి ఇన్సూరెన్స్ లో ఏర్పాటు చేయడం జరిగిందని కావున అందరూ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అగనంపూడి భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షులు సాయినా అప్పారావు సభా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో టిఎన్టియుసి టిడిపి నాయకులు గంతకోరు అప్పారావు ,డొక్కా రమేష్ ,మాడిసి వెంకట్రావు, శిరం శెట్టి బాబ్జి, ఉరుకూటి రామనాయుడు భవన కార్మిక నాయకులు రెడ్డి శ్రీను, లంక రాము నాయుడు మరియు భవన కార్మిక సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!