Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీమేడే స్ఫూర్తితో పెట్టుబడుదారి విధానాలను అడ్డుకుందాం

మేడే స్ఫూర్తితో పెట్టుబడుదారి విధానాలను అడ్డుకుందాం

మాడుగుల: జయజయహే : మాడుగుల బస్ కాంప్లెక్స్ వద్ద గురువారం మేడే వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఎగరవేసారు. మే డే స్ఫూర్తితో పెట్టుబడుదారి విధానాలను అడ్డుకుందాం 8 చట్టాలును కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు .ఈ కార్యక్రమంలో మాడుగుల ఎంపీడీవో కోంకి అప్పారావు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకుడు ఇరట నరసింహమూర్తి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు కే భవాని మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను అమెరికాలోని చికాగోలో కార్మిక తిరిగి బాటు మలుపు తిప్పింది చికాగో వీరుల స్పైస్, పార్యన్స్, ఏంజెల్, ఫిషర్ లింగ్ లను ఉరితీసి ఉద్యమాన్ని అణిచివేయాలనే పెట్టుబడుదారుల కుట్ర వీగిపోయిందన్నారు. ప్రపంచమంతా ఈ అగ్ని దావనలంగా వ్యాపించింది పెట్టుబడిదారులు తలొగ్గి రోజుకు ఎనిమిది గంటల పనిపై చట్టాలు చేశారు 140 సంవత్సరాల తర్వాత ఎల్.టి. చైర్మన్ సుబ్రమణ్యన్ రోజుకు 15 గంటలు పని చేయాలని కార్మికులను వెటకారం చేస్తున్నాడు . మరోవైపు బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్న చట్టాలు హక్కులు సారం పూర్తిగా తీసివేసి సారము లేని లేబర్ కోడ్ లను కార్మిక వర్గంపై రుద్దాలని ప్రభుత్వం ఆరాటపడుతుందన్నారు. ఈ లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తే సంఘం పెట్టనివ్వరు ఇప్పటికే శ్యామ్ సంగ్ కంపెనీ చెన్నైలో చూసాం కార్మికులు సమ్మెలు చేస్తే జీతాలు కట్ ఏస్మా ప్రయోగం నాయకులను జైలుకు నెడతారు ఉన్న హక్కులన్నీ పోతాయి అందుకే ఎనిమిది గంటల పని నిలబెట్టుకోవడం ఒక సవాల్ లేబర్ కోడ్ లు అమలు కాకుండా అడ్డుకోవడం మరో సవాల్ ఈ రెండు సవాళ్లకు వ్యతిరేకంగా పోరాటానికి యువత కార్మిక వర్గం ప్రతిబోనాలని మనిషి మనిషిగా బ్రతకాలంటే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటల దినచర్య ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ యూనియన్ గ్రీన్ అంబాసిడర్ క్లాత్ మిత్ర ఏలుసూరి ఈశ్వరరావు, ఆశ యూనియన్ జి శ్యామల, ఏ లక్ష్మి ,ఏ రాము, టీ వెంకటలక్ష్మి, రిక్షా యూనియన్ రాజు బాలరాజు, కొండలరావు, కొండబాబు,ప్రజా సంఘాల కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?