ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీమంత్రులపై చర్యలు తీసుకోవాలి

మంత్రులపై చర్యలు తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వానిదే నిర్లక్ష్యం

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి డిమాండ్

చంద్రంపాలెంలో బాధిత కుటుంబానికి ఓదార్పు

జయజయహే : లక్షల మంది భక్తులు వస్తారని తెలిసిన భద్రత ఏర్పాట్లు నిర్లక్ష్యం వహించారని గతంలో తిరుపతి సంఘటన నేడు సింహాచలం సంఘటన ఇదే కోవలో కనిపిస్తుందని మాజీ సీఎం వైయస్ జగన్ ఆరోపించారు. వారం రోజుల క్రితం గోడ కట్టి మొదలు పెట్టారని రెండు రోజుల క్రితం పూర్తి చేశారని మండిపడ్డారు. పది అడుగులు ఎత్తు 70 అడుగులు వెడల్పు నిర్మాణం చేసిన ఎక్కడ నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. కాంక్రీట్ గోడ నిర్మించవలసిన చోట ఇటుకులతో నిర్మించారని ఎండగట్టారు. టెండర్లు లేకుండా అవినీతికి పాల్పడ్డారని అన్నారు. చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో చంద్రబాబుకు తెలియదా అంటూ జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడానికి ఇదొక సంఘటన కనిపిస్తుందని అన్నారు . మంత్రుల పైన దేవస్థానం ముఖ్య అధికారుల పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ డిమాండ్ చేశారు.

                             

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!