ePaper
Tuesday, June 9, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనాలుగు గ్రామాల్లో తెలుగుదేశం గ్రామ కమిటీలు ఏర్పాటు

నాలుగు గ్రామాల్లో తెలుగుదేశం గ్రామ కమిటీలు ఏర్పాటు

📰 Generate e-Paper Clip

మాడుగుల : జయజయహే : తెలుగుదేశం పార్టీ సంస్థ గత ఎన్నికల్లో భాగంగా మంగళవారం మాడుగుల మండలంలో నాలుగు గ్రామాల్లో గ్రామ కమిటీలను నియమించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు సమక్షంలో మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు అద్దేపల్లి జగ్గారావు, ఉండూరు దేవుడు ఆధ్వర్యంలో గ్రామాలలో పార్టీ సమావేశాలు నిర్వహించి కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీటిలో భాగంగా జంపిన గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా అన్నం శెట్టి కొండలరావు రాకోటి చిన్నోడు ఎన్నికయ్యారు. అలాగే సత్యవరం గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా జెర్రిపోతుల సూర్యనారాయణ, జాజుల శ్రీను ఎన్నికయ్యారు, జాలంపల్లి గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా బాణం భీమలింగేశ్వర రావు, బచ్చల కన్నయ్య దొర ఎన్నికయ్యారు, ఇక ఎల్ పొన్నవోలు గ్రామసభ అధ్యక్ష కార్యదర్శులుగా యన్నంశెట్టి సత్య రావు, గండి పడాల రమేష్ బాబు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వడ్డే రాజ్ కుమార్, పుప్పాల రమేష్, ఎంపీటీసీ బీశెట్టి శ్రీనివాస్, పుట్ట మోహన్రావు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!