Sunday, April 12, 2026
Homeశివ సూర్య డైలీవేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

వేటకు వెళ్లిన మత్స్యకారుడు మృతి

జయజయహే : విశాఖ జిల్లా భీమునిపట్నం జోనల్ కార్యాలయం వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లి ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. భీమునిపట్నం జోన్ బోయవీధికి చెందిన చింతపల్లి తాతారావు(60) అనే మత్స్యకారుడు సోమవారం నదీ సాగరసంగమం సమీపంలో చేపల వేటకు వెళ్ళాడు. అలల తాకిడికి ప్రమాదవశాత్తు మునిగిపోయాడు. ఇవాళ భీమునిపట్నం రూరల్ మండలం అన్నవరం బీచ్ లో తాతారావు మృతదేహం ఒడ్డుకు చేరుకుంది. మృతుడు తాతారావుకు ముగ్గురు కుమారులు ఉన్నారు .భీమిలి పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భీమిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?