ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీఉగ్రవాదాన్ని రూపుమాపాలి

ఉగ్రవాదాన్ని రూపుమాపాలి

📰 Generate e-Paper Clip

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ మరియు మానవత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో శాంతి సమావేశం

శ్రీకాకుళం : జయజయహే : కాశ్మిర్ లోయ పహల్గం హత్యకాండలో అమరులైన 26మంది హిందూ సోదరులకు సద్గతులు ప్రాప్తించాలని, పాకిస్తాన్ ఉగ్రవాద ఘాతకానికి నిరసన తెలుపుతూ స్థానిక సూర్యమహల్ కూడలిలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో శాంతి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మానవత చైర్మన్ ప్రొఫెసర్ డి.విష్ణు మూర్తి, అధ్యక్షులు, లయన్స్ జోన్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని రూపుమాపాలని, దేశ సైన్యం, ప్రధాని నరేంద్ర మోడీ సైతం ధీటుగా ఎదుర్కొంటారు అని భారత పౌరులంతా ఏకమై స్పందించి నిరసన చేపట్టడం హర్షణీయమన్నారు. లైన్స్ క్లబ్ సెంట్రల్ మెంటార్ నటుకుల. మోహన్, డిసి బడాన.దేవభూషణ్, కార్యదర్శి లైన్ డా.పైడి.సింధూర మాట్లాడుతూ మతం పేరు చెప్పి, హిందువుల మనోభావాలను దెబ్బ తియ్యటం సరికాదని, ప్రభుత్వం ఈ దాడిని తీవ్రంగా ఖండించాలని ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తూ లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్, మానవత స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాంతి సమావేశంలో ఒక గంట సమయం మౌనం పాటించారన్నారు. భారతీయ పౌరుల స్పందించిన తీరు అమోఘమని, ఈ హేయ చర్యతో ఉగ్రవాదమనే మాటే వినపడదని లయన్స్ ఇంటర్నేషనల్ జోన్ చైర్మన్ పొన్నాడ. రవి కుమార్, టెక్కం రామ్ గోపాల్ అన్నారు.

ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు, లైన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు, పార్వతీసం, శివతేజ ఉర్లం, ఈశ్వర్ రావు, చరణ్, జి ఎన్ వి కిరణ్, జిఎన్ శ్యాం, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!