ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీనేడు ఢిల్లీకి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి ఛాన్స్ రాష్ట్ర ప్రాజెక్టులపై...

నేడు ఢిల్లీకి చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీకి ఛాన్స్ రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించే అవకాశం

📰 Generate e-Paper Clip

జయజయహే : సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం అర్థరాత్రి 12 గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంటారు.అక్కడి నుంచి ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన వన్ జన్ పథ్‌కు వెళ్లి బస చేస్తారు. 22వ తేదీ మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను చంద్రబాబు కలుస్తారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై వారితో చర్చిస్తారు. కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షాతో పాటు, జలవనరుల శాఖామంత్రి, న్యాయ శాఖా మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!