ePaper
Sunday, June 7, 2026
ePaper
Homeశివ సూర్య డైలీ'బి.పి', 'షుగర్' పరీక్షలు నిర్వహించిన వాకర్స్ క్లబ్బులు

‘బి.పి’, ‘షుగర్’ పరీక్షలు నిర్వహించిన వాకర్స్ క్లబ్బులు

📰 Generate e-Paper Clip

విజయనగరం,శనివారం : శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ మరియు అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో నెలవారీ సేవా కార్యక్రమాల్లో భాగంగా బుధవారం ఉదయం స్థానిక అయ్యన్నపేట చెరువు ప్రక్కనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో అపోలో డయోగ్నిస్టిక్ వారి సౌజన్యంతో బి.పి.షుగర్ పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సలహాదారులు పిన్నింటి సూర్యనారాయణ,ఎలక్ట్ గవర్నర్ ఎ. తిరుపతి రావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతీ ఒక్కరు తరుచుగా బి.పి, షుగర్ పరీక్షలను చేసుకోవాలని,ఆహార నియమాలను పాటించడం అవసరమని, ప్రతీరోజు ప్రజలంతా క్రమంతప్పకుండా నడవాలని సూచించారు. అపోలో టెక్నీషియన్లు రుక్మిణి, జైరాం సేవలందించిన ఈ శిబిరంలో క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఎ.ఎస్.ప్రకాశరావు మాష్టారు, శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ,అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), కార్యదర్శి ఐ.వి. ప్రసాద్, కోశాధికారి ఆర్.సి.హెచ్. అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!