విశాఖపట్నం:జయజయహే : అణగారిన జీవితాలకు ఆలంబన.. ఆత్మాభిమానపు స్వాలంబన.. భారత జాతి స్వేచ్ఛా పతాక సమత కోసం గళమెత్తిన చైతన్య గీతిక.. జాతి జనుల భవిత కోసం దారి చూపిన జయ కేతనం.. భారత రాజ్యాంగ రచనా చేతనం.. మన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి సేవలను స్మరించుకుంటూ తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ సోమవారం ఉదయం విశాఖపట్నంలో ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర ఆయన విగ్రహానికి పూలుమాలు వేసి ఘన నివాళులు అర్పించారు. జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు మనకు కావాల్సింది జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు కావాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోరుకునే వారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ అన్నారు.ఈ కార్యక్రమంలో వేగి రాధాకృష్ణ, బి.దన్వి, వానపల్లి గాయత్రీ ఫణి కుమారి, వై.జగదీష్, డాక్టర్ కే సురేష్ బాబు, సన్ మూర్తి, ఆర్.వి.వి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
జాతిని తాకట్టు పెట్టి పదవులు తెచ్చుకునే నాయకులు కాదు.. జాతి కోసం పదవులను తృణప్రాయంగా వదులుకునే నిజాయితీ గల నాయకులు కావాలి —– తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
RELATED ARTICLES

