Saturday, April 11, 2026
Homeహెల్త్ న్యూస్గర్భిణులను తనిఖీలు చేస్తున్న వైద్యాధికారి డీకే హిమబిందు గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలి: వైద్యాధికారి...

గర్భిణులను తనిఖీలు చేస్తున్న వైద్యాధికారి డీకే హిమబిందు గర్భిణులు ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలి: వైద్యాధికారి డీకే హిమబిందు

సీలేరు, జయజయహే : గర్భిణులు విధిగా ఆస్పత్రిలోనే ప్రసవం పొందాలని కొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డీకే అన్నారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక ఆరోగ్య తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ గర్భిణులు తొమ్మిది నెలల్లో వైద్యుల సూచన మేరకు చింతపల్లి ఏరియా హాస్పిటల్ కి వెళ్లి స్కానింగ్ చేయించుకోవాలన్నారు. స్కానింగ్ చేయించుకోవడం వల్ల ప్రమాదకరమైన ప్రసవాలను ముందుగా గుర్తించవచ్చునన్నారు. గర్భిణులు క్రమంగా ఆరోగ్య తనిఖీలు చేయించుకుంటూ పోషకాహారం తీసుకో వాలన్నారు. పురిటినొప్పులు ప్రారంభమైన తరువాత ఆస్పత్రికి తరలించడం కంటే గర్భిణులు ప్రసవ సమయానికి పది రోజులు ముందుగా ఆస్పత్రిలో చేరాలన్నారు. చింతపల్లి, గూడెం కొత్త వీధిలో గర్భిణుల వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయని, పురిటి నొప్పులు వచ్చేవరకు ఈ వసతి గృహాల్లో వైద్యుల పర్యవేక్షణలో బస చేయాలన్నారు. గర్భిణుల కు వసతి గృహంలో పూర్తి స్థాయి సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోనున్నాయన్నారు. గర్భిణు లు, సహాయకులకు భోజన సదుపాయం కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి గర్భిణీ వసతి గృహం సేవలను సంద్వినియోగం చేసుకోవాలన్నారు. గృహాల్లో ప్రసవం పొందడం తల్లి బిడ్డ ఆరోగ్యానికి క్షేమకరం కాదని ఆమె తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?