ePaper
Saturday, June 6, 2026
ePaper
Homeశివ సూర్య డైలీపద్మశ్రీ వనజీవి రామయ్య మృతి దేశానికి తీరని లోటు- అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం...

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి దేశానికి తీరని లోటు- అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్

📰 Generate e-Paper Clip

అనకాపల్లి : జయజయహే: వనజీవి రామయ్య మృతి సమాజానికి తీరని లోటు ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను మన దేశం కోల్పోయింది అని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ విచారం వ్యక్తం చేశారు.ఇంటిపేరును వనజీవిగా మార్చుకున్న దరిపల్లి రామయ్య జీవితం అందరికీ ఆదర్శం కోటికి పైగా మొక్కలు నాటి రికార్డు సృష్టించారు.కొన్ని నెలల క్రితం హైదరాబాదులో ఎక్స్పీరియం పార్కు ప్రారంభోత్సవంలో రామయ్య దంపతులకు సన్మానించడం వారితో ప్రకృతి గురించి చర్చించె అవకాశం రావడం పట్ల ఎప్పటికి గొప్ప అదృష్టంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.చెట్లను మన వంశపారంపర్యంగా భావించి, వాటిని సంరక్షించడం ద్వారా మన భవిష్యత్తును కాపాడతామని చెప్పిన ఆయన చరిత్రలో ఎప్పటికీ నిలిచి ఉండిపోతారని కొనియాడారు. పద్మశ్రీ అవార్డు ఆయన సేవలకు ఒక గుర్తింపు మాత్రమే, కానీ ఆయన చూపించిన మార్గం ఎన్నో తరాలకు ప్రేరణగా నిలుస్తుంది అని మనందరం ఆయన చూపించిన మార్గాన్ని అనుసరించాలని తెలిపారు.వనజీవి రామయ్య మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసారు.మనం ఒక మొక్కను నాటడమే వనజీవి రామయ్య గారికి అందించే నిజమైన నివాళులు అని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!