Thursday, April 9, 2026
Homeవాతావరణంవచ్చేవారంలో భూకంపం..? ఏపీ, తెలంగాణకు హెచ్చరిక ట్వీట్ చేసిన ఎర్త్ క్వేక్ రీసెర్చ్...

వచ్చేవారంలో భూకంపం..? ఏపీ, తెలంగాణకు హెచ్చరిక ట్వీట్ చేసిన ఎర్త్ క్వేక్ రీసెర్చ్ సంస్థ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్రంలోని రామగుండంలో భూకంపం వచ్చే అవకాశం ఉందని ఎర్త్‌క్వేక్ రీసర్చ్ అండ్ అనాలసిస్ సంస్థ తెలిపిందిఈ మధ్య వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఊహించని భూప్రకంపనలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే దేశ, ప్రపంచ వ్యాప్తంగా భూమి కంపించింది. అందులో గతంలో ఏపీ, తెలంగాణ వంటి రెండు తెలుగు రాష్ట్రాలను భూకంపం భయబ్రాంతులకు గురి చేసింది. తాజాగా మరోసారి భూకంప హెచ్చరికలు వచ్చాయి. తెలంగాణలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే వారం రోజుల్లో రామగుండం కేంద్రంగా భారీ భూకంపం ప్రజలను భయపెట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈసారి భూకంప తీవ్రత భారీ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ భూకంపాల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని లేదని కేంద్ర ఐఎండీకి సంబంధించిన అధికారులు చెబుతున్నారు. కాగా అప్రమత్తంగా ఉండటం మంచిదే. కానీ నిర్ధారణలేని సమాచారంపై ఎవరూ భయపడాల్సిన పనిలేదని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.. భూ ప్రకంపనలు హైదరాబాద్, వరంగల్, అమరావతి వరకు చేరే అవకాశం ఉందని అందులో పేర్కొంది. ఈ ట్వీట్ వైరల్‌గా మారింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?