టెన్త్ ఫలితాల్లో తొలిసారి రికార్డు
కాకినాడ విద్యార్థిని నేహంజని ప్రతిభ
జయజయహే : పదో తరగతి ఫలితాలలో గతంలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. నేడు విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని చరిత్ర సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని ఏకంగా 600 మార్కులకుగానూ 600 స్కోర్ చేసింది. చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా నేహాంజని సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆమె కాకినాడలోని భాష్యం స్కూల్ విద్యార్థిని అని సమాచారం. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం, మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు ఎండ అనిత అనే విద్యార్థిని 599 మార్కులతో సత్తా చాటింది. ఆమె ఎలమంచిలిలోని చైతన్య స్కూల్‌లో చదివినట్లు సమాచారం. పల్నాడు జిల్లాలో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థినికి 598 మార్కులతో దుమ్మురేపింది. ఒప్పిచర్ల జడ్పీ హైస్కూల్‌లో చదివిన పావని చంద్రిక అనే విద్యార్థిని కేవలం 2 మార్కులు మాత్రమే కోల్పోయింది. కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివి స్టేట్ ర్యాంక్ మార్కులు తెచ్చుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

