52వ సీజేఐగా జస్టిస్‌ బీఆర్ గవాయ్‌ ప్రమాణ స్వీకారం..

భారత సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో ఈ కార్యక్రమం నిర్వహించగా.. ప్రధాని మోడీతో పాటు, కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతి, ఇతర అతిథుల పాల్గొన్నారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న గవాయ్‌ జన్మించారు. 1985 మార్చి 16న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత 2003 నవంబరు 14న బాంబే హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2005 నవంబరు...