SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 11:22 am Posted by : SHIVASURYA NEWS

1455 రోజులుగా పేదలకు అన్నదాన కార్యక్రమం. మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్

వేములవాడ : జయ జయహే : మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో 1455 రోజులుగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా బుధవారం రోజున లక్ష్మీగణపతి కాంప్లెక్స్ రాజన్న భీమేశ్వర ఆలయాల వద్ద ఉన్న పేదలకు అన్నార్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నేటి అన్నదాతలుగా వట్టెముల వాస్తవ్యులు యామ సమత దేవరాజు దంపతులు శాశ్వత దాతలుగా జువ్వాడి స్నేహాలత వెంకటేశ్వర రావు దంపతులు, ప్రతాప స్వప్న సంపత్ దంపతులు, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు, గణాచారి మఠం శైలజ సాంబశివు దంపతులు, దేవరాజు ఉమ బాలచందర్ రాజు దంపతులు, రామడుగు శ్రీలత, కొడుకులు కోడళ్లు: ప్రజ్ఞ శరత్ చంద్ర దంపతులు, శిరీష సాయిచంద్ర దంపతులు, శర్వాణి రవిచంద్ర దంపతులు, హైదరాబాద్ వాస్తవ్యులు చిన్నారులు శ్రీహర్ష, సాయికృష్ణ ఉన్నారని పేదలకు అన్నదాన కార్యక్రమానికి సహకారం అందించాలను కునే దాతలు ట్రస్టు సభ్యులను సంప్రదించా లని లేదా ట్రస్టు ఫోన్. నం.92469 39388 ద్వారా సంప్రదించాలని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ కోరారు. నేటి అన్నదాన కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వొడ్యాల వేణు, పొలాస రాజేందర్, పసుల శ్రీనివాస్, శివ తదితరులు పాల్గొన్నారు.