11వేల జాబ్స్.. 1.21కోట్ల దరఖాస్తులు
ఆర్ ఆర్ బీ, ఎన్టీపీసీ పోస్టులకు డిమాండ్ నిరుద్యోగ భారతానికి నిదర్శనం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు .. 11,558 నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ ఎన్ టీ పీసీ పోస్టుల భర్తీకి గతేడాది ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గతేడాదే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టులకు రాత పరీక్ష తేదీలను అధికారికంగా విడుదల చేయలేదు. తాజాగా ఈ పోస్టులకు వచ్చిన దరఖాస్తుల వివరాలను ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. రైల్వేలో ఇచ్చింది తక్కువ పోస్టులే అయినప్పటికీ...