Thursday, April 9, 2026
Homeశివ సూర్య డైలీస్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర - స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం

స్వామి విద్యానికేతన్ స్కౌట్స్ మరియు గైడ్స్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం

గాజువాక : జయజయహే : ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మరియు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విశాఖపట్నం జిల్లా డీఈవో ప్రేమ్ కుమార్ ఆదేశాల మేరకు జీవీఎంసీ గాజువాక 67వ వార్డు సాయిరాం నగర్ హై స్కూల్ రోడ్ లో గల స్వామి విద్యానికేతన్ హై స్కూల్ ఆధ్వర్యంలో గల కూర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ విద్యార్థిని విద్యార్థులతో పాఠశాల యాజమాన్యం పాఠశాల పరిసర ప్రాంతం మరియు 67 వ వార్డులో కొంత భాగం లో స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమము నిర్వహించడం జరిగింది. స్వామి విద్యానికేతన్ విద్యార్థులు సాయిరాం నగర్ లో గల కాల్వలు పక్కన ఉండే పిచ్చి మొక్కలను పీకి వేయడం నీటి పంపులు వద్ద పేరిక పోయిన నాచు తదితర వ్యర్ధాలను శుభ్రం చేయటం, పూల మొక్కలను ట్రిమ్ చేయడం, పరిసరాలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహించడం మరియు విద్యార్థులతో స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర *ప్రతిజ్ఞను* విద్యార్థులతో చెప్పించడం మరియు పుర ప్రజలకు స్వచ్ఛత ప్రాధాన్యత గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు స్వామి విద్యానికేతన్ ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణస్వామి పాలూరు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఇంచార్జ్ గరిమెళ్ళ పద్మజా పూర్ణ మరియు ఉపాధ్యాయులు తూర్పాటి సూర్యకుమారి, సింగిరెడ్డి లక్ష్మి, సాలపు రూపులత, అచ్యుతని లక్ష్మి వీర కుమార్ మాస్టారు తదితరులు పాల్గొన్నారని పాఠశాల కరస్పాండెంట్ పాలూరు దేవి తెలిపారు.                        .                                             

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?