SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 7:57 am Posted by : SHIVASURYA NEWS

సెల్ టవర్ ఎక్కి దూకేస్తానని ఒక వ్యక్తి ఆత్మహత్యా యత్నం

అచ్యుతాపురం : జయజయహే : అచ్యుతాపురం మండలానికి చెందిన గొర్ల ధర్మవరం గ్రామానికి చెందిన లంక హరి నాగ శంకర్రావు అనే రైతు అచ్యుతాపురం ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసుకుంటానని బెదిరిస్తున్నాడు.వివరాల్లోకి వెళితే లంక ధర్మవరం గ్రామానికి చెందిన రైతు ఎమ్మార్వో ఆఫీస్ లో తనకున్న భూమిని ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది వేరే వ్యక్తులకి పేరుమీద రికార్డులు మార్పు చేశారని ఆ భూమి నాది అని తన పేరు మీద ఉన్న భూమిని వేరే వ్యక్తికి ఎలా మారుస్తారని ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగిన ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది తనను పట్టించుకోలేదని తన భూమి వేరే వ్యక్తి పేరు మీద నుంచి నా పేరు మీదకి రికార్డులు మార్చండి అని అడిగి నందుకు ఎమ్మార్వో ఆఫీస్ సిబ్బంది నన్ను లంచం డిమాండ్ చేస్తున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు తక్షణమే తనకున్న భూమి తన పేరు మీద రికార్డులు మార్చాలని లేదంటే సెల్ టవర్ నుంచి దూకి ఆత్మ హత్య చేసుకుంటానని బాధితుడు ఆరోపిస్తున్నాడు.