SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 28 April 2025, 11:52 am Posted by : SHIVASURYA NEWS

సూర్య నమస్కారాల ప్రపంచ రికార్డు సాధించిన సతీష్

చోడవరం : జయజయహే : ఈనెల 7 వ తేదీన జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, పతంజలి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరకులో జరిగిన మహా సూర్య వందనం కార్యక్రమంలో 22,000 మందితో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసిన చోడవరం యోగ గురువు పుల్లేటి సతీష్ వరల్డ్ రికార్డు సాధించారు.108 నిమిషాల్లో 108 సార్లు సూర్య నమస్కారాలు చేసినందుకు గాను వరల్డ్ రికార్డ్ ఆఫ్ సూర్య నమస్కారాలు సతీష్ ని సత్కరించి వరల్డ్ రికార్డు సర్టిఫికెట్ను అందజేశారు. విశాఖ బిజెపి క్యాంప్ ఆఫీస్ లో ఈనెల 27వ తేదీన జరిగిన కార్యక్రమంలో చత్తీస్గఢ్ బిజెపి ఫైనాన్షియల్ కమిటీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విశాఖ జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీనివాసరాజు, అడపా శంకరరావు తదితరులు సమక్షంలో ఈ అవార్డు సర్టిఫికెట్ అందజేసినట్టు సతీష్ సోమవారం తెలిపారు. దీంతో చోడవరంలో సతీష్ ని పలువురు అభినందించారు.