Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీసీనియర్ సిటిజన్స్ ఐడి కార్డులు స్వీకరిస్తున్న టిడిపి నాయకులు

సీనియర్ సిటిజన్స్ ఐడి కార్డులు స్వీకరిస్తున్న టిడిపి నాయకులు

జయజయహే : జీవీఎంసీ 85వ కొండయ్య వలస సచివాలయం లో ఆర్ ఐ మడక పరమేష్ ద్వారా స్థానిక టిడిపి నాయకులు సీనియర్ సిటిజన్స్ కార్డులు పొందడం జరిగింది. విశాఖ పార్లమెంటరీ టి ఎన్ టి యు సి అధికార ప్రతినిధి బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో సీనియర్ సిటిజన్స్ కి 60 సంవత్సరాలు దాటిన వారందరికీ స్థానిక సచివాలయంలో డిజిటల్ సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ ఇస్తారు దీనిపై మన రక్తం గ్రూపు, మన దగ్గర వారి ఫోన్ నెంబరు మరియు సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా ఆపద వచ్చినట్లైతే పోలీసు వారికి 112 కి ఫోన్ చేసినట్లయితే వెంటనే వారు స్పందించి మనకు రక్షణ కల్పిస్తారు. ఆర్టీసీ బస్సుల్లో టిక్కెట్ పై 25% రాయితీ ఇస్తారు బస్సుల్లో సీనియర్ సిటిజన్స్ కి రెండు సీట్లు కేటాయింపు ఉంటుంది రైల్వేలో రిజర్వేషన్ చేసుకున్నప్పుడు క్రింద సీటు ఇవ్వడం జరుగుతుంది. రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ తక్కువగా వచ్చినప్పుడు వాటిని వెరిఫికేషన్ చేసుకొని అటువంటి వారికి వృద్ధాప్య ప్రభుత్వ పెన్షన్ తెల్ల రేషన్ కార్డు అందజేయవలసిందిగా ఇటీవల విశాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు డోల శ్రీ వీరాంజనేయులు స్వామి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కావున 60 సంవత్సరాల దాటిన వారందరూ డిజిటల్ ఐడి కార్డులు తమ దగ్గర ఉన్న సచివాలయంలో తీసుకోవాల్సిందిగా బలిరెడ్డి కోరారు. టిడిపి నాయకులు డొక్కా రమేష్ బోండా ఈశ్వరరావు ఎం. నరసింహారావు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?