సిసోడియా అవుట్.. ముత్యాలరాజు ఇన్ రెవిన్యూ నుంచి సిసోడియా బదిలీ ముత్యాలరాజుకు కీలక పోస్టింగ్ పలువురు ఐఎఎస్ బదిలీలు
కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు హోదాల్లో పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టిన అధికారులకు ఇప్పుడు పోస్టింగ్ ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు సమయం నుంచి రెవిన్యూ - రిజిస్ట్రేషన్ శాఖలు కీలకంగా మారాయి. ఈ శాఖలను ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పర్యవేక్షించిన సీనియ ర్ ఐఏఎస్ అధికారి సిసోడియాను బదిలీ చేసారు. సిసోడియాకు హ్యాండ్లూమ్, టెక్స్‌టైల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు కేటాయించారు....