సిరి ప్రసాద్ ట్రాక్ సాంగ్స్ బ్యానర్ ప్రారంభం

విశాఖపట్నం: జయజయహే : సిరి ప్రసాద్ ట్రాక్ సాంగ్స్ బ్యానర్ ను జబర్దస్త్ ఆర్టిస్ట్ సత్తిపండు ప్రారంభించారు. జీ ఆర్ కే అధినేత గేదెల ఈశ్వరరావు ఆధ్వర్యంలో గాజువాకలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గాయనీ, గాయకులకు ఉపాధి అవకాశాలతో పాటు శిక్షణ ఇచ్చేందుకు ఈ బ్యానర్ బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. కళాకారులకు ప్రోత్సాహం అవసరమని, ఇటువంటి బ్యానర్లు ప్రారంభించడం ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ నిర్మాత పాలకుర్తి సుబ్బారావు, జి...