Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య జయంతి

సిపిఎం ఆధ్వర్యంలో సుందరయ్య జయంతి

చోడవరం: జయజయహే : దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య జయంతి సందర్భంగా గురువారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చోడవరం కొత్తూరు జంక్షన్ లో పుచ్చలపల్లి సుందరయ్య చిత్రపటానికి సిపిఎం సిఐటియు నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్తూరు జంక్షన్ లో సిపిఎం నాయకులు నాగిరెడ్డి సత్యనారాయణ ఆధ్వర్యంలో మజ్జిగ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, కార్మికులకు పెద్ద ఎత్తున పంపిణీ చేశారు.

ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు

యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో చోడవరం కరెంట్ ఆఫీస్ వద్ద యూనియన్ పతాకాన్ని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ కార్మిక చట్టాలను కాపాడాలని, లేబర్ కోడ్స్ లు రద్దు చేయాలని, ఎనిమిది గంటల విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిని రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినదించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ప్రేమ చంద్రశేఖర్, రాంబాబు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు సిఐటియు ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద కూడా మేడే పతాకాన్ని ఆవిష్కరించారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?