Monday, April 13, 2026
Homeశివ సూర్య డైలీసింహాచలం ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన

సింహాచలం ప్రమాదం పై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జనసేన

చోడవరం జయజయహే : సింహాచలం వరహాలక్ష్మీ నరసింహ స్వామి వారి చందన యాత్రలో బుధవారం తెల్లవారుజామున సింహాచలంలో చోటు చేసుకున్న సంఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసిందని చోడవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి పి వి ఎస్ ఎన్ రాజు అన్నారు. బుధవారం మాట్లాడుతూ ఇది దురదృష్టకర సంఘటనని మృతుల కుటుంబాలకు తమ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం తగు చొరవ చూపాలి అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు ప్రస్తుత సంఘటనపై విచారణ జరిపి తగు చర్యలు చేపట్టాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?