సింధూర ఆపరేషన్ కు సంఘీభావం తెలిపిన మాడుగుల ప్రజలు
కొత్తవారిపట్ల అప్రమత్తంగా ఉండండి మాడుగుల: జయజయహే : పెహల్గాo లో ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం చేపట్టిన సింధూర ఆపరేషన్ కు మాడుగుల ప్రజలు సంఘీభావం తెలిపారు. ముష్కరులను తుద ముట్టించేందుకు ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటదని పలువురు నాయకులు స్పష్టం చేశారు. గురువారం మాడుగుల బస్టాండ్ ఆవరణలో మన్యం జ్యోతి సేవా సంఘం అధ్యక్షుడు మండల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ సమావేశంలో సీనియర్ బిజెపి నాయకుడు పుట్ట గంగయ్య, ఎంపీపీ రాజారాం...