SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 08 May 2025, 9:37 am Posted by : SHIVASURYA NEWS

సింధూర ఆపరేషన్ కు సంఘీభావం తెలిపిన మాడుగుల ప్రజలు

కొత్తవారిపట్ల అప్రమత్తంగా ఉండండి

మాడుగుల: జయజయహే : పెహల్గాo లో ఉగ్రదాడి నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం చేపట్టిన సింధూర ఆపరేషన్ కు మాడుగుల ప్రజలు సంఘీభావం తెలిపారు. ముష్కరులను తుద ముట్టించేందుకు ఉగ్రవాదులను అంతమొందించేందుకు భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి ప్రజలు సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటదని పలువురు నాయకులు స్పష్టం చేశారు. గురువారం మాడుగుల బస్టాండ్ ఆవరణలో మన్యం జ్యోతి సేవా సంఘం అధ్యక్షుడు మండల సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంఘీభావ సమావేశంలో సీనియర్ బిజెపి నాయకుడు పుట్ట గంగయ్య, ఎంపీపీ రాజారాం తోపాటు పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశంలో విభజన మతాలవారు జీవిస్తున్నారని అటువంటి పరిస్థితుల్లో కేవలం ఒక మతం వారిని టార్గెట్ చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పూనుకోవడం విచారకరమన్నారు. దేశంలో ముస్లింలు క్రైస్తవులు వంటి మతస్తులు కూడా జీవిస్తున్నారని అలా అని ముస్లింలందరూ చెడ్డవారు కాదని వారిలో దేశభక్తులు కూడా ఉన్నారని చెప్పారు. భారతదేశ సంయమనంతో ఉంటుందని కానీ ఉగ్రవాదులు మాత్రం దేశంలో చిచ్చు రేపుతున్నారని మండిపడ్డారు. తాజాగా దేశమంతా ప్రతి పల్లెలోనూ కొత్తవారు చొరబడ్డారని ఇతర దేశాలకు చెందిన పరమతలవారు తిష్ట వేస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మన గ్రామంలో గాని మన ప్రాంతంలో కానీ మన వీధిలో కానీ కొత్తవారు వస్తే వారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు వారి పరిస్థితి ఏంటి అన్న విషయాలపై విచారణ జరపాలన్నారు. అలాగే మదర్సాలు పేరుతో చిన్న పిల్లలకు శిక్షణ ఇస్తున్నారని వాటిపట్ల కూడా దృష్టి సారించాలని సూచించారు. అయితే భారత ప్రధాని ఒకటే చెప్పారని పాకిస్తాన్ ప్రజల పట్ల తమ గౌరవం ఉందని కానీ పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల పట్ల తామ చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సింధూర్ ఆపరేషన్ విజయవంతంగా కొనసాగాలని ముష్కరులను ఉగ్రవాదులను పూర్తిగా తుడిచి పెట్టాలని వారి కోరేరు. అలాగే పిఓకే స్వాధీనం చేసుకోవాలని భారత ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవణంలో జాతీయ పతాకంతో సంఘీభావ మానవహారం నిర్వహించి జయహో భారత్ అంటూ నినాదాలు చేస్తూ భారత్ సైనికులకు త్రివిధ దళాధిపతులకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు సంఘాల ప్రతినిధులు కెవిపి ఆంజనేయులు, ఎస్. సూర్యనారాయణ మాస్టారు, తలపు రెడ్డి నాగచంద్ర, జి మహేష్, జి శ్రీనివాసు,పి బలరాం, మరువడ ఈశ్వరరావు, జి జగన్నాథరావు, కే వెంకటేశ్వరరావు, డి చిన్నారావు, పి మురళి, తదితరులు పాల్గొన్నారు