సరిహద్దు భద్రతకు జవాన్ – ఆహార భద్రతకు కిసాన్
జయజయహే : దేశ రక్షణలో జవాన్, దేశ పోషణలో కిసాన్. ఒకరిది భూమి కోసం సాహసం, మరొకరిది భూమితో సహవాసం. సైనికుడు సరిహద్దుల్లో విపత్కర పరిస్థితుల్లో అయినవారిని ఆత్మీయులను వదిలి శత్రువులపై నిరంతరం యుద్ధం చేస్తే ..రైతు పుడమి ఒడిలో ప్రకృతి బడిలో విత్తనాలనే అక్షరాలతో స్వేదం విడిచి సాగు యుద్ధం సాగిస్తాడు. దేశానికి నిస్వార్థంగా సేవ చేసే ఈ ఇద్దరి ప్రస్థానం అందరికి ఎంతో గర్వకారణం ఆపరేషన్ సింధూర్ – సలాం సైనికా ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్...