Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసమ్మె జయప్రదం చేయండి

సమ్మె జయప్రదం చేయండి

మాడుగుల, జయజయహే : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశంలోని కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా లేబర్ కోడ్స్ తెచ్చిందని, ఈ లేబర్ కోడ్స్ రద్దు, కనీస వేతనాలు అమలు, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలన్న డిమాండ్లతో మే 20 నా నిర్వహించనున్న సమ్మెలో కార్మికులు రైతులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కార్యదర్శి ఆర్ దేముడు నాయుడు జిల్లా కోశాధికారి వి వి శ్రీనివాసరావు లు పిలుపునిచ్చారు.శుక్రవారం చీడికాడ లో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశంనిర్వహించారుకార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ వల్ల సమ్మె చేసే హక్కు , సంఘం పెట్టుకునే హక్కు, పనిగంటలు పెంచడం, పారిశ్రామిక వివాదాలు చట్టానికి తూట్లు పోడవటం వంటి అనేక దుర్మార్గమైన విధానాలు ఈ లేబర్ కోడ్స్ లో పొందుపరిచారని వీటిని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించకుండా తిప్పుకొట్టాలని వారు పిలుపునిచ్చారు. అందుకే మే20 న దేశవ్యాప్త సమ్మె జరుగుతుందని దీనిలో కార్మికులు, రైతులు, కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అంగనవాడి ప్రాజెక్టు కార్యదర్శి ఎం జానకి మధ్యాహ్నం భోజనం పథకం జిల్లా నాయకులు ఎస్.కె బేబీ, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు కమల్ కుమారి, ఐకెపి యానిమెట్ల యూనియన్ చిన్నమ్మలు, బి ఉమా నిర్మల పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?