Friday, April 10, 2026
Homeశివ సూర్య డైలీసమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే లక్ష్యం - ఎమ్మెల్యే వంశీకృష్ణ

సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే లక్ష్యం – ఎమ్మెల్యే వంశీకృష్ణ

జయజయహే : జనవాణి లో ప్రజల నుంచి అర్జీలు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ స్వీకరించారు .30 ,36, 36 , 38 వార్డ్ ల ప్రజల నుంచి నేరుగా పలు శాఖల అధికారుల సమక్షంలో అర్జీలు స్వీకరించారు. టీడీపీ సౌత్ ఇంచార్జి సుధాకర్ , జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివ ప్రసాద్ రెడ్డి , ఎమ్మార్వో, జోనల్ కమిషనర్ , పలు విభాగాల ఆధారాలు, కూటమి శ్రేణులు హాజయ్యారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం

నియోజకవర్గంలోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడమే తన ముందున్న లక్ష్యం అని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మంగళవారం ఏవీఎన్ కాలేజీ దగ్గర ‘జనవాణి’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజవర్గ పరిధిలోని 30,36,37,38 వార్డులకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున అర్జీలను ఆయన స్వీకరించారు. ఆయా వార్డులోని ప్రధానంగా సీసీ కెమెరాల ఏర్పాటు, రోడ్లు, విద్యుత్ లైట్లు, నూతన రేషన్ కార్డులు, తదితర అంశాలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిశితంగా వింటూ వాటిని నమోదు చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజవర్గాన్ని ఉన్నతంగా అభివృద్ధి చేసిన తర్వాతే ఆయా ప్రాంతాలకు వస్తానని తెలియజేశారు. ప్రజలు సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే జనవాని కార్యక్రమాన్ని చేపట్టానన్నారు. ఆయా దీర్ఘకాలిక సమస్యలను సైతం పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలను అనుసరిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు పాత్ర నిర్వహిస్తానని తెలియజేశారు. ప్రజలు సమస్యలను తనకు నేరుగా తెలియజేయాలన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా ఆదేశాలు జారీ చేస్తే నమ్మవద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, ఆయా వార్డ్ ల కార్పొరేటర్ లు, టీడీపీ, జనసేన, బిజెపి, శ్రేణులు, సిబ్బంది, కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు, ఆయా వార్డులకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

                                 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?