సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..! జూన్ 12 నుంచే..!
ఏపీలో ప్రస్తుతం అమలవుతున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచేందుకు వీలుగా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 41 వేల పాఠశాలలు, నాలుగు వేల సంక్షేమ హాస్టళ్లలో ఈ నెల 12వ తేదీ నుంచే దీన్ని అమలు చేయబోతోంది. దీంతో పాటు రైతులకు కూడా మేలు చేసే విధంగా మరో నిర్ణయం కూడా తీసుకుంది. దీంతో మధ్యాహ్న భోజన పథకం రూపురేఖలు మారనున్నాయి. పాఠశాల విద్యార్థులకు రుచికరమైన, పౌష్టికాహార భోజనం అందించేందుకు సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర...