Saturday, April 11, 2026
Homeశివ సూర్య డైలీసంఘమిత్ర పశుగ్రాస రైతు ఉత్పత్తి దారుల అవగాహన సదస్సు

సంఘమిత్ర పశుగ్రాస రైతు ఉత్పత్తి దారుల అవగాహన సదస్సు

మాడుగుల: జయజయహే : చీడికాడ మండలం ఖoడివరం గ్రామo లో గురువారం మండలంలో గల పాడి రైతులకు సంఘమిత్ర పశుగ్రాస రైతు ఉత్పత్తి దారుల సంస్థ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంవత్సరం సభ్యులు గా నమోదు అవ్వడం గురించి సంఘమిత్ర ఫార్డర్ ప్రొడ్యూసర్స్ అండ్ గ్రోవర్స్ కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు అయింది. ఈ కార్యక్రమానికి ప్రెసిడెంట్ చిట్టెమ్మ , ఉపాధ్యక్షుడు అప్పలనాయుడు, ఆ సొసైటీ మెంబర్లు. హాజరయ్యారు. మాడుగుల పశువైద్య శాల సహాయ సంచాలకులు డా. వి.చిట్టి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమo లో డాక్టర్ ఎ సి హెచ్ గణేష్ రెడ్డి, డాక్టర్ జి గాయత్రీ దేవి డాక్టర్ కె రాఘవమ్మ పాల్గొన్నారు. డాక్టర్ వి చిట్టి నాయుడు మాట్లాడుతూ చీడికాడ మండలంలోని 45 మంది రైతుల ను మెంబర్లుగా నమోదు చేయాలన్నారు .ఈ ఎఫ్ పి ఓ లో మెంబర్లుగా జాయిన్ అవ్వడం వల్ల పాడి రైతుల కి కలిగే ఉపయోగాలను గూర్చి వివరించారు. సభ్యులు గా చేరాలంటే కనీసం 500 రూపాయలు నుండి 2000 రూపాయలు వరకు షేర్ ధనం చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యేసరికి 13 మంది పాడి రైతులు మెంబర్లు గా నమోదయ్యారు. మండలం లోని పాడి రైతులు ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే వారు కూడా మెంబర్లుగా నమోదు అవ్వడానికి సంబంధిత సచివాలయంలోని పశుసంవర్ధక శాఖ సహాయకులను సప్రదించాలన్నారు.సభ్యులు గా చేరడానికి కావలసిన డాక్యుమెంట్లుఆధార కార్డు,3 పాస్ పోర్ట్ ఫొటోలు,బ్యాంక్ అకౌంట్ నకలు నకలు,1 బి లాండ్ నకలు,నామినీ వివరాలు వారి బ్యాంక్ ఖాతా అందజేయాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

Need Help?