మాడుగుల: జయజయహే : మాడుగుల షిరిడి సాయి ఆలయానికి నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా మాడుగుల గ్రామానికి చెందిన స్వర్గీయ వేమన రామారావు జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మంగళవారం 100 స్టేట్ గ్లాసులు, 100 స్టీల్ కంచాలు విరాళంగా అందజేశారు. వారి మనుమడు వీటిని ఆలయ గుమస్తా పి.లోవరాజుకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రానున్న రోజుల్లో పూర్తిగా ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలన్న ఉద్దేశంతో వీటిని అందజేసినట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల సతీష్ తెలిపారు. ఇందుకు ప్రోత్సహించిన ఆలయ గుమస్తా లోవరాజును, దాతలను అభినందించారు.