శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయి ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న చొక్కాకుల వెంకటరావు.
విశాఖపట్నం జయ జయహే: జీవీఎంసీ 47, 48 వార్డు బాపూజీనగర్ లో కొలువైవున్న శ్రీ సంపత్ వినాయక దుర్గా సాయి ఆలయం 17 వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు వికె పిసిపిఐఆర్ యుడిఎ మాజీ చైర్ పర్సన్ చొక్కాకుల వెంకటరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చొక్కాకుల వెంకటరావును సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చల్లని మజ్జిగస్టాల్ ను ప్రారంభోత్సవం చేసారు. ఈ కార్యక్రమంలో...