SHIVASURYA NEWS
Newspaper Banner
Date of Publish : 16 May 2025, 11:49 am Posted by : SHIVASURYA NEWS

శ్రీశ్రీశ్రీ మోదకొండమ్మ తల్లి హుండి లెక్కింపు

జయజయహే : అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండల కేంద్రంలో కొలువైయున్న గిరిజనుల ఆరాధ దైవమైన శ్రీ శ్రీ మోదకొండమ్మ 2023. 2024. 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన అమ్మవారి హుండి లెక్కింపు కారక్రమం పెదబయలు సర్పంచ్ మరియు గ్రామ పెద్దల సమక్షంలో శుక్రవారం నాడు ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో జరిగినది. అమ్మవారి హుండి లెక్కింపు కార్యక్రమం గత రెండు సంవత్సరాల నుండి అమ్మవారి ఆర్థిక ఆదాయం 85,550/ – రూపాయలు వచ్చాయని పెద్దలు తెలిపారు. మొత్తం ఆదాయములో 1550 రూపాయలు ఆలయ పూజారికి అదికాదాయం కింద ఇవ్వడం జరిగిందని లెక్కింపు సభ్యులు సర్పంచ్ మాధవరావు మాజీ జెడ్పిటిసి కొంట సూర్యనారాయణ వైయస్సార్సీపి నాయకులు గంపరాయి సూరయ్య మాజీ సర్పంచ్ పాంగి సింహాచలం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 18, 19 , 20 తేదీలలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ శ్రీ మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు . అమ్మవారి ఉత్సవాలకు మండల ప్రజలందరూ కూడా ఉత్సవ కమిటీకి సహకరించి కోరారు . కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు సమరెడ్డి పూర్ణయ్య, గుబరి రాధాకృష్ణ , అడకటియ శశిధర్, చంద్రమౌళి , సమరెడ్డి లాలి బాబు , గ్రామ పెద్దలు నల్లగంటి దీక్షపతి, నోటి బుజ్జి, కటకం చిరంజీవి, రుడ చిన్నయ్య , ఇతరులు పాల్గొన్నారు.